న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా న్యాయ కస్టడీలో ఉంటే, నిబంధనల ప్రకారం ఆటోమేటిక్‌గా సస్పెండ్ అయినట్లేనని స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది.
బీహార్ ఆసుపత్రి అధికారి కేసులో కీలక పరిణామం
బీహార్‌లోని సమస్తిపూర్ సదర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన విశ్వజీత్ సింగ్‌పై లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టు ఉద్యోగికి రావాల్సిన రూ.36,421 వేతన బకాయిలు విడుదల చేసేందుకు రూ.4,000 లంచం అడిగినట్లు కేసు నమోదైంది.
ఈ కేసులో ఆయన దాదాపు 15 రోజుల పాటు న్యాయ కస్టడీలో ఉన్నారు. అనంతరం సెషన్స్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే పాట్నా హైకోర్టు ఆ బెయిల్‌ను రద్దు చేసింది.
దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు బెయిల్ రద్దు ఉత్తర్వులను కొట్టివేసి, సెషన్స్ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను పునరుద్ధరించింది.
ఉద్యోగుల సస్పెన్షన్‌పై కోర్టు ఏమంది?
-
ప్రభుత్వ ఉద్యోగి అరెస్టయి 48 గంటలకు మించి న్యాయ కస్టడీలో ఉంటే డీమ్డ్ సస్పెన్షన్ వర్తిస్తుంది.
-
ఇందుకు ప్రత్యేకంగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదు.
-
సస్పెన్షన్ రద్దు చేసిన అనంతరం అదే ఆసుపత్రిలో అదే పదవిలో తిరిగి నియమించడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది.
- ఈ అంశాన్ని పరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బీహార్ ప్రభుత్వానికి సూచించింది.
తీర్పు వివరాలు:
-
తీర్పు తేదీ: 06 నవంబర్ 2026
-
ధర్మాసనం: జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ మన్మోహన్
-
కేసు: విశ్వజీత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్