ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే ఆటోమేటిక్‌గా సస్పెన్షన్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా న్యాయ కస్టడీలో ఉంటే, నిబంధనల ప్రకారం ఆటోమేటిక్‌గా సస్పెండ్ అయినట్లేనని స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. బీహార్ ఆసుపత్రి అధికారి కేసులో కీలక పరిణామం బీహార్‌లోని సమస్తిపూర్ సదర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన విశ్వజీత్ సింగ్‌పై లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టు ఉద్యోగికి రావాల్సిన రూ.36,421 వేతన బకాయిలు...