శ్రీసిటీలో ఇండియా మెటల్ వన్ రెండో తయారీ కేంద్రం ప్రారంభం
-రూ.108 కోట్లతో నూతన ప్లాంట్ ఏర్పాటు -200 మందికి అదనపు ఉద్యోగ అవకాశాలు సత్య వెలుగు న్యూస్, సూళ్లూరుపేట : శ్రీసిటీలో పారిశ్రామిక అభివృద్ధికి మరో ముందడుగు పడింది. జపాన్‌కు చెందిన ప్రముఖ స్టీల్ ప్లేట్ల ప్రాసెసింగ్ సంస్థ ఇండియా మెటల్ వన్ స్టీల్ ప్లేట్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (IMOP) తన రెండో తయారీ కేంద్రాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించింది. ఈ నూతన ప్లాంట్ ఏర్పాటుతో శ్రీసిటీలో సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. 2012 ఆగస్టులో శ్రీసిటీలో కార్యకలాపాలు ప్రారంభించిన ఐఎంఓపీ...