నాయుడుపేట మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి విజయంపై కిలివేటి సంజీవయ్యకు జగన్ అభినందనలు!

నాయుడుపేట, సత్యవెలుగు న్యూస్: నాయుడుపేట మున్సిపాలిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చైర్‌పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ విజయం సాధించిన నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి కిలివేటి సంజీవయ్య చేసిన కృషిని జగన్ ప్రశంసించారు. పార్టీ కోసం సమర్థవంతంగా పనిచేసి విజయానికి కృషి చేశారని కొనియాడారు. ఇదే ఉత్సాహంతో...