నాయుడుపేట మున్సిపల్ విజయంపై వైఎస్ జగన్‌ను కలిసిన కాకాణి, కిలివేటి సంజీవయ్య
సత్య వెలుగు న్యూస్, నవంబర్ 12: సూళ్లూరుపేట RC ప్రతినిధి: తాడేపల్లి: నాయుడుపేట మున్సిపాలిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, ఆయన సతీమణి, నాయుడుపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన తంబిరెడ్డి...