చౌడేపల్లి, నవంబర్ 10 ,సత్య వెలుగు న్యూస్: జిల్లా స్థాయి అండర్-17 వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన జెడ్‌పీహెచ్‌ఎస్ కొత్తకోట పాఠశాల విద్యార్థిని కె. వెన్నెల తదుపరి స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు వెన్నెలను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.