sathyavelugu.com
Date of Publish : 12 November 2026, 10:26 pm Posted by : Dr.K.Suresh Editor

మధుసూదన్ నాయుడు నాయకత్వానికి ఆకర్షితులై టీడీపీలో చేరిన మైనార్టీ నాయకులు

-పుంగనూరులో టీడీపీకి పెరుగుతున్న ఆదరణ

సత్య వెలుగు న్యూస్ – నవంబర్ 12 | పుంగనూరు టౌన్: పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు నాయకత్వానికి ఆకర్షితులై పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. పుంగనూరుకు చెందిన రోషన్ సిల్క్స్ రహమతుల్లా, ఇమ్రాన్, అబ్దుల్, అనీస్, మున్నా తదితరులు వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధుసూదన్ నాయుడు నాయకత్వంలో పుంగనూరులో టీడీపీ మరింత బలోపేతం అవుతుందనే నమ్మకంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేస్తున్న కృషి తమను ఆకర్షించిందని పేర్కొన్నారు.

అనంతరం మధుసూదన్ నాయుడు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే రోజుల్లో పుంగనూరులో టీడీపీ మరింత బలపడుతుందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.