sathyavelugu.com
Date of Publish : 05 November 2026, 5:52 pm Posted by : Dr.K.Suresh Editor

కోట మండలంలో ప్రశాంతంగా ముగిసిన MPTC, ZPTC పోలింగ్!

-19 సెగ్మెంట్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేవు..

-ప్రశాంతంగా సాగిన ఓటింగ్ ప్రక్రియ

కోట, నవంబర్ 5,సత్యవెలుగు న్యూస్: తిరుపతి జిల్లా కోట మండలంలో MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మండల పరిధిలోని మొత్తం 19 సెగ్మెంట్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగింది.

ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకుడు ధ్రువకుమార్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సిబ్బంది పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది.

మండలంలోని 19 సెగ్మెంట్లలోనూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ముగియడంతో స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు.