మున్సిపల్ చైర్పర్సన్ తంబిరెడ్డి రాజేశ్వరమ్మ దంపతులకు మహిళా నేతల ఘన సన్మానం
నాయుడుపేట,నవంబర్ 5,సత్య వెలుగు న్యూస్: నాయుడుపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా విజయం సాధించిన తంబిరెడ్డి రాజేశ్వరమ్మ, ఆమె భర్త జనార్దన్ రెడ్డి దంపతులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజేశ్వరమ్మ దంపతులకు పూలమాలలు వేసి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షురాలు కురుగొండ ధనలక్ష్మి, నాయుడుపేట మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కటకం దీపిక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు రత్నశ్రీ తదితర...