నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం

-71.13 శాతం పోలింగ్ నమోదు..   -మహిళా ఓటర్లదే పైచేయి సత్య వెలుగు న్యూస్ | నవంబర్ 1 | నాయుడుపేట:నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిసింది. పట్టణంలోని మొత్తం 32 వార్డుల పరిధిలో ఏర్పాటు చేసిన 64 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ప్రజాస్వామ్య హక్కును ఉత్సాహంగా వినియోగించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసుల, ఎన్నికల అధికారుల పటిష్ట పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. 37,100 మంది ఓటర్లలో...