రోడ్డు సౌకర్యం కల్పించలేదంటూ కమ్మవారిపాలెం గ్రామస్తుల పోలింగ్ బహిష్కరణ!

సత్య వెలుగు న్యూస్ – తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం కమ్మవారిపాలెం గ్రామస్తులు తమ గ్రామ సమస్యలు పరిష్కరించలేదంటూ ఎన్నికల పోలింగ్‌ను బహిష్కరించారు. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం కల్పించకపోవడంతో నిరసనగా ఓటు వేయడానికి నిరాకరించారు. పెరికిలంపాటి కండ్రిగ పోలింగ్ బూత్‌లో కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన సుమారు 200 ఓట్లు ఉన్నాయి. అయితే తమ గ్రామ అభివృద్ధి విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ నాయకులు పంపిన వాహనాల్లో...