పెళ్లకూరు మండలంలో రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్!

-24 పంచాయతీల పరిధిలో జెడ్పీటీసీ ఎన్నికలు.. -పుల్లూరు, పాల్చూరులో ఎంపీటీసీ పోలింగ్ పెళ్లకూరు, సత్య వెలుగు న్యూస్: పెళ్లకూరు మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. మండలంలోని 24 పంచాయతీల పరిధిలోని 34 గ్రామాల్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరగనుండగా, పుల్లూరు, పాల్చూరు గ్రామాల్లో రెండు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ కోసం 31,472 పోలింగ్ కేంద్రాల్లో...