గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు ముమ్మరం- ఎంపీడీవో రాజేంద్ర
-నాయుడుపేట మండలంలో ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల సత్య వెలుగు న్యూస్ , నవంబర్ 12 , నాయుడుపేట: రానున్న గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు–2026 నిర్వహణకు సంబంధించి నాయుడుపేట మండలంలో అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మండల పరిధిలోని గ్రామ పంచాయతీల వారీగా ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ఎంపీడీవో రాజేంద్ర బాలాజీ విడుదల చేశారు. ఈ ముసాయిదా జాబితాలో గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల సంఖ్య, ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాలు, కేంద్రాల...