మతకాముడి గ్రామంలో మురుగునీటితో నిండిన సిమెంట్ రోడ్లు

-పారిశుద్ధ్యం పడకేసింది.. -రాకపోకలకు తీవ్ర అంతరాయం – -విద్యార్థుల అవస్థలు పట్టించుకునేదెవరు? -రోడ్డుపైనే మురుగునీటి నిల్వ.. దుర్వాసనతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి సూళ్లూరుపేట, నవంబర్ 11, సత్య వెలుగు న్యూస్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన రహదారులు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ, కొన్ని గ్రామాల్లో ప్రాథమిక సమస్యలు సైతం పరిష్కారానికి నోచుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనంగా సూళ్లూరుపేట మండల పరిధిలోని మతకాముడి గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్య నిలుస్తోంది. గ్రామంలోని కమ్యూనిటీ హాల్ సమీపంలో, బ్రహ్మానందం చికెన్ షాప్...