sathyavelugu.com
Date of Publish : 12 November 2026, 9:32 pm Posted by : Dr.K.Suresh Editor

పచ్చదనం దిశగా పద్మావతి విద్యాలయ విద్యార్థుల అడుగులు

-స్కౌట్స్ వారోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటిన విద్యార్థులు

సత్య వెలుగు న్యూస్ , నవంబర్ 12, సూళ్లూరుపేట: స్కౌట్స్ వారోత్సవాల్లో భాగంగా సూళ్లూరుపేటలోని పద్మావతి విద్యాలయ సెకండరీ స్కూల్‌లో ఏపీజే అబ్దుల్ కలాం ఓపెన్ స్కౌట్ ట్రూప్ ఆధ్వర్యంలో విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని పాఠశాల ప్రిన్సిపల్ సంజయ్ పాండా కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్స్ షర్మిల, స్వర్ణలత, స్కౌట్ మాస్టర్ షేక్ అజారుద్దీన్, గైడ్ కెప్టెన్ చెన్నూరు శారద, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల పర్యావరణ చైతన్యాన్ని పాఠశాల యాజమాన్యం అభినందించింది.