ఓట్ల లెక్కింపు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే జరగాలి!

-ప్రజాతీర్పును గౌరవిస్తూ పారదర్శకంగా ఫలితాలు ప్రకటించాలి -ఆమ్ ఆద్మీ పార్టీ నేతల డిమాండ్ సూళ్లూరుపేట, నవంబర్ 2 | సత్యవెలుగు న్యూస్: సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీలకు నవంబర్ 3వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు పాలేటి వెంకటస్వామి, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పట్టపురవి డిమాండ్ చేశారు. నవంబర్ 1వ తేదీన రెండు మున్సిపాలిటీల్లో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో, ఓట్ల లెక్కింపు...