దివ్యాంగ ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచన

విజయవాడ, నవంబర్ 11 ,సత్య వెలుగు న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి దివ్యాంగ ఉద్యోగులు, ఓటర్లకు అనుకూలమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి డా. ఏ. మల్లికార్జున, ఐఏఎస్, Rc.No.863/SEC-F1/2026 ద్వారా జారీ చేసిన లేఖలో దివ్యాంగ ఉద్యోగులకు వీలైనంత వరకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కల్పించాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు. అదేవిధంగా దివ్యాంగ ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు...