ఎన్నికల విధుల్లో విషాదం.. పోలింగ్ అధికారి హరిత మృతి

-మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగాఢ సంతాపం సత్య వెలుగు న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా పోలింగ్ అధికారి అస్వస్థతకు గురై మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. అనంతపురం జిల్లా కూడేరు మండలం కాడదారకుంట పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న పోలింగ్ అధికారి హరిత (58) గురువారం ప్రాణాలు కోల్పోయారు. హరిత అనంతపురం జిల్లా డి.హీరాహల్ మండలం పూలకుర్తి గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా కాడదారకుంట పోలింగ్ కేంద్రానికి హాజరైన ఆమెకు...