sathyavelugu.com
Date of Publish : 05 November 2026, 12:31 pm Posted by : Dr.K.Suresh Editor

కోటలో వాలంటీర్ల సహకారంతో దివ్యాంగుల ఓటు హక్కు వినియోగం!

కోట,సత్య వెలుగు న్యూస్ : ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమనే నినాదానికి అనుగుణంగా కోటలో దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాలంటీర్లు అందించిన సహాయ సహకారాలతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న దివ్యాంగులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.

దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాలంటీర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంలో సహకరించారు. వారి సహకారంతో దివ్యాంగులు సులభంగా ఓటు వేసి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములయ్యారు.

దివ్యాంగులకు సహాయ సహకారాలు అందించిన వాలంటీర్ల సేవలను పలువురు అభినందించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.