పెళ్లకూరు జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి చైతన్య కృష్ణారెడ్డికి మద్దతుగా విస్తృత ప్రచారం!
టీడీపీ నేత వేలూరు కళ్యాణ్ రెడ్డి పెళ్లకూరు, సత్య వెలుగు న్యూస్ :పెళ్లకూరు మండల జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి చైతన్య కృష్ణారెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలని టీడీపీ నేత వేలూరు కళ్యాణ్ రెడ్డి కోరారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పసుపు కండ్రిగ, అనకవోలు, పెరుమాళ్లపల్లి, పుల్లూరు, రెడ్డిగుంట, కలవకూరు, ఎడపూడి గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వేలూరు కళ్యాణ్ రెడ్డి...