పెళ్లకూరు మండలంలో కామిరెడ్డి కుటుంబ సభ్యుల విస్తృత ప్రచారం!

-ఇంటింటి ప్రచారంలో ప్రభావతమ్మ, రజిని.. -గ్రామాల్లో సందడి చేసిన ఎన్నికల ప్రచారం పెళ్లకూరు, సత్య వెలుగు న్యూస్:పెళ్లకూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డికి మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు ప్రభావతమ్మ, రజిని తదితరులు శనివారం మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం తాళ్లాయపాడు గ్రామం నుంచి ప్రారంభమైన ప్రచారం పెన్నేపల్లి, కానూరు, శిరసనంబేడు, రాజుపాలెం, చావలి, కప్పగుంట, కండ్రిగ, దర్శమాల, పాలచూరు, జంగాలపల్లి, అనకవోలు తదితర గ్రామాల్లో కొనసాగింది. మంగళ...