తుఫానును సైతం లెక్కచేయకుండా వైఎస్సార్సీపీ ప్రచారం!
-వర్షంలోనూ నాలుగు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం.. -అభ్యర్థి శ్రావణ సంధ్యకు మద్దతు కోరిన నాయకులు సూళ్లూరుపేట, నవంబర్ 2 | సత్యవెలుగు న్యూస్: సూళ్లూరుపేట నియోజకవర్గంలోని విన్నమాల ఎంపీటీసీ సెగ్మెంట్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి తోప్పాని శ్రావణ సంధ్య తరఫున పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మురసు తుఫాను ప్రభావంతో వర్షం కురుస్తున్నప్పటికీ పెరికల్లింపాటకండ్రిగ, కమ్మవారిపాలెం, కారుమంచువారితండ్రిగ, తిమ్మాజి కండ్రిగ గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేపట్టారు. వర్షంలోనూ కొనసాగిన ప్రచారం తుఫాను ప్రభావంతో వర్షం కురుస్తున్న పరిస్థితుల్లోనూ పార్టీ శ్రేణులు గ్రామాల్లో...