పెళ్లకూరు, సెప్టెంబర్ 7: వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ టీడీపీ నాయకులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావును కలిసి వినతిపత్రం అందజేశారు.
భూ రికార్డులకు సంబంధించిన ఆధారాలను అధికారులకు సమర్పించినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. సంబంధిత భూములపై సమగ్ర విచారణ జరిపి, రికార్డులను పరిశీలించి, ఆరోపణలు నిజమైతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పేరం రమేష్ నాయుడు, మధుసూదన్ నాయుడు, వేలూరు మురళీకృష్ణారెడ్డి, శిరసనంబేడు చైతన్య కృష్ణారెడ్డి, రాకేష్ రెడ్డి, లోకేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.


