ఓజిలి, సెప్టెంబర్ 21 | సత్య వెలుగు న్యూస్
తిరుపతి జిల్లా ఓజిలి మండలం సగుటూరు పెద్ద చెరువు వద్ద పంచాయతీకి చెందిన చెట్లను అక్రమంగా నరికివేశారంటూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ ఆధ్వర్యంలో సోమవారం స్పందన (PGRS)లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.
పంచాయతీకి చెందిన చెట్లను నరికివేయడం వల్ల కోటి రూపాయలకు పైగా విలువైన ప్రజా ఆస్తికి నష్టం వాటిల్లిందని కౌన్సిల్ ప్రతినిధులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులుగా తేలిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
అలాగే ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. ప్రజా ఆస్తుల పరిరక్షణకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ ప్రతినిధులు కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిల్ సభ్యులు, నాయకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ వైస్ చైర్మన్ సల్మాన్ రాజ్ కృతజ్ఞతలు తెలిపారు.

