పుంగనూరు టౌన్, సెప్టెంబర్ 23 (సత్య వెలుగు న్యూస్): పుంగనూరు పట్టణ అభివృద్ధిలో భాగంగా మున్సిపాలిటీకి నూతన JCBను పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వై. మధుసూదన్ నాయుడు బుధవారం ప్రారంభించారు.
అనంతరం పట్టణ పారిశుధ్య కార్మికులకు చీపుర్లు, తట్టలు, గ్లౌజులు తదితర అవసరమైన పనిముట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వై. మధుసూదన్ నాయుడు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ పనులు, రోడ్ల మరమ్మతులు, చెత్త తొలగింపు వంటి పనులను వేగవంతం చేయడానికి నూతన JCB ఉపయోగపడుతుందని తెలిపారు.
పట్టణ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలను అభినందించారు. వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ అధికారులు, NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.




