📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమన్నారుపోలూరులో టిడ్కో గృహాలు ప్రారంభం 185 మంది లబ్ధిదారులకు రూ.56.61 లక్షల వాటాధనం చెక్కుల పంపిణీ

మన్నారుపోలూరులో టిడ్కో గృహాలు ప్రారంభం 185 మంది లబ్ధిదారులకు రూ.56.61 లక్షల వాటాధనం చెక్కుల పంపిణీ

📰 Generate e-Paper Clip

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 24 (సత్య వెలుగు NEWS):
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నారుపోలూరులో రూ.131 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన టిడ్కో గృహాలను ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా 185 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.56.61 లక్షల వాటాధనం రీఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు.

దీర్ఘకాలంగా అద్దె ఇళ్లలో నివసించిన కుటుంబాలు సొంతింటి యజమానులుగా మారడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి పరసారత్నం, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!