-ప్రభుత్వం మీ వెన్నంటే ఉందంటూ బాధిత కుటుంబాలకు ధైర్యం
-బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం..
-ఎప్పుడైనా సంప్రదించవచ్చంటూ కలెక్టర్ హామీ
శ్రీసిటీ, అక్టోబర్ 7, సత్య వెలుగు న్యూస్ :
శ్రీసిటీలో జరిగిన బాయిలర్ పేలుడు ప్రమాదంలో బాధిత కుటుంబాలకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ భరోసా కల్పించారు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు.
ప్రమాదంలో బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం అందించనున్నట్లు తెలిపారు. బాధితుల సమస్యలను తెలుసుకుని, వారి కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
బాధిత కుటుంబాలకు తన వ్యక్తిగత సంప్రదింపు నంబర్‌తో కూడిన విజిటింగ్ కార్డును అందజేసిన కలెక్టర్, అవసరమైనప్పుడు ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు.
ప్రమాదం అనంతరం బాధితులకు జిల్లా యంత్రాంగం అందిస్తున్న సహాయ చర్యలను తమిళనాడు ఎమ్మెల్యే ప్రశంసించినట్లు సమాచారం. బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పడంలో కలెక్టర్ వెంకటేశ్వర్ చొరవను అభినందించారు.

