తిరుపతి: స్టైఫండ్ చెల్లింపు, విద్యా సమస్యల పరిష్కారం కోసం అలిపిరి వద్ద నిరసన చేపట్టిన పారామెడికల్ విద్యార్థులపై పోలీసుల దాడిని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను చర్చించి పరిష్కరించాల్సిన ప్రభుత్వం, పోలీసులతో దాడులు చేయించడం అమానవీయమని విమర్శించారు. విద్యార్థుల పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, వెంటనే స్టైఫండ్ చెల్లించి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పారామెడికల్ విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండించిన ఎంపీ గురుమూర్తి
0
12


