📄 ePaper
Sunday, September 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పల్నాడునరసరావుపేటలో ‘స్వచ్ఛతా హీ సేవా’కు శ్రీకారం

నరసరావుపేటలో ‘స్వచ్ఛతా హీ సేవా’కు శ్రీకారం

📰 Generate e-Paper Clip

నరసరావుపేట: ప్రజా భాగస్వామ్యంతో పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నరసరావుపేటలో ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన ప్రారంభించారు.

సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు పాఠశాలలు, మార్కెట్లు, బస్టాండ్లు, ఆసుపత్రులు, పర్యాటక ప్రాంతాల్లో వివిధ పారిశుద్ధ్య, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించి, తడి–పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని ఎమ్మెల్యే సూచించారు.

మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల సేవలను అభినందించిన ఆయన, పరిశుభ్రత ప్రతి పౌరుడి సామూహిక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!