వడమాలపేట: వడమాలపేట మండలం బంగారు రెడ్డి పంచాయతీ పరిధిలోని బాలనాయుడు కండ్రిగలో వైఎస్సార్సీపీ కార్యకర్త కమ్మసాని ఆనంద రెడ్డి కర్మక్రియలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆర్కే రోజా సోదరులు వై. కుమారస్వామి రెడ్డి హాజరై ఆనంద రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఆనంద రెడ్డి మృతి పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. కర్మక్రియల కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, బంధువులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

