-బి. వాసుదేవరాజు (అడ్వకేట్) గారి కోడలిగా….
-రాజకీయ వారసురాలిగా ప్రజల ముందుకు వస్తున్న మేలపుష్ప రెడ్డి
సత్య వెలుగు న్యూస్ ,పుత్తూరు, అక్టోబర్ 27:కార్వేటినగరం మండల కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా మేలపుష్ప రెడ్డి ప్రజల ముందుకు వస్తున్నారు. ప్రముఖ న్యాయవాది బి. వాసుదేవరాజు గారి కోడలిగా, ఆయన రాజకీయ వారసురాలిగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ఆమె తరఫున విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నన్ను మీ ఇంటి బిడ్డగా భావించి, మీ ఆశీస్సులు అందించి, మీ అమూల్యమైన మద్దతుతో నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని తెలిపారు.
ప్రజల ఆదరాభిమానాలు, ఆశీస్సులతో ముందుకు సాగుతూ ప్రజాసేవకు అంకితమవుతానని మేలపుష్ప రెడ్డి విజ్ఞప్తి చేశారు.

