📄 ePaper
Sunday, October 25, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంనేలకొండపల్లి బౌద్ధ స్తూపం వద్ద ఘనంగా అశోక విజయదశమి ఉత్సవాలు

నేలకొండపల్లి బౌద్ధ స్తూపం వద్ద ఘనంగా అశోక విజయదశమి ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

ఖమ్మం జిల్లా,సత్య వెలుగు న్యూస్: బుద్ధిష్టు సొసైటీ ఆఫ్ ఇండియా ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నేలకొండపల్లిలోని ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధ స్తూపం వద్ద అశోక విజయదశమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ ఉపాసకులు, సంఘం నాయకులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో బుద్ధిష్టు సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా జనరల్ సెక్రటరీ ఉపాసక డాక్టర్ పత్తిపాటి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు ఉపాసక పగిడికత్తుల ఈదయ్య, ఉపాసక కట్టెకోల వెంకటేశ్వరరావు, మహిళా కన్వీనర్ ఉపాసక సుధారాణి, గౌరవ సలహాదారు ఉపాసక కుడుముల స్వామిదాసు, సీనియర్ ఉపాసకులు సుభాష్ పాల్గొన్నారు.

అలాగే బుద్ధిష్టు సొసైటీ ఆఫ్ ఇండియా మండల అధ్యక్షులు మాదా వెంకన్న, ఉపాసకులు రాము, సిరాజ్, బీఎస్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు పెద్దపాక వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.

బౌద్ధ స్తూపం వద్ద నిర్వహించిన ఈ ఉత్సవాల్లో సంఘం ప్రతినిధులు, ఉపాసకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అశోక విజయదశమి సందర్భంగా బౌద్ధ వారసత్వం, చారిత్రక ప్రాధాన్యతను స్మరించుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!