📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అన్నమయ్యబోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు

బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు

📰 Generate e-Paper Clip

-బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన బోయకొండ గంగమ్మ

చౌడేపల్లి, అక్టోబర్ 12, సత్య వెలుగు న్యూస్:ప్రముఖ శక్తి క్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి మధుసూదన్ నాయుడు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పుష్పాలు, పండ్లతో ఆలయానికి ప్రత్యేక అలంకరణ

దసరా మహోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలు, పండ్లతో సుందరంగా అలంకరించారు. డార్మెంటరీ హాల్‌లో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి వివిధ హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు.

మధుసూదన్ నాయుడు దంపతులకు ఘన స్వాగతం

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు విచ్చేసిన మధుసూదన్ నాయుడు దంపతులకు ఘన స్వాగతం లభించింది. నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. భవానీనగర్‌లో గజమాలతో సత్కరించి వారికి ఆహ్వానం పలికారు.

అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి, ఉప కమిషనర్ ఏకాంబరం సాదరంగా ఆహ్వానించి అమ్మవారి దర్శనం కల్పించారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమంలో మధుసూదన్ నాయుడు దంపతులు పాల్గొన్నారు.

అమ్మవారి ఆశీస్సులతో ప్రజాసేవ

ఈ సందర్భంగా మధుసూదన్ నాయుడు మాట్లాడుతూ, బోయకొండ గంగమ్మ ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పలు కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం లభించడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. అమ్మవారి చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలపై, కూటమి ప్రభుత్వంపై ఉండాలని ఆకాంక్షించారు.

భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

దసరా నవరాత్రి ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!