పెళ్లకూరు,సత్య వెలుగు న్యూస్: కలవకూరు ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బండి బాలు తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ఖరారు చేసుకున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ తరఫున కేటాయించిన బి-ఫారాన్ని రిటర్నింగ్ ఆఫీసర్‌కు సమర్పించారు. పార్టీ నాయకులు కోటి తుమ్ముల, గిరి రెడ్డిలతో కలిసి ఆయన బి-ఫారాన్ని అందజేశారు.
వైఎస్సార్సీపీ అధిష్ఠానం బండి బాలుకు బి-ఫారం కేటాయించడంతో కలవకూరు ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో ఆయన అధికారిక అభ్యర్థిగా ముందుకు సాగుతున్నారు. బి-ఫారం సమర్పణతో నామినేషన్ ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది.
కలవకూరు ఎంపీటీసీ స్థానం నుంచి పోటీకి సిద్ధమైన బండి బాలు ప్రజల మద్దతుతో విజయం సాధించడమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ పరిణామంతో స్థానిక వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

