సత్య వెలుగు న్యూస్, పుత్తూరు, నవంబర్ 3:
జడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ ఏ. భాగ్యరాజ్ ప్రజల్లోకి వెళ్లి ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈరోజు ప్రతి గడపను సందర్శిస్తూ, గ్రామ గ్రామాన పర్యటిస్తూ ప్రజలను నేరుగా కలుసుకున్నారు.
గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వారి ఇబ్బందులను శ్రద్ధగా విన్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని భరోసా కల్పించారు.
ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని డాక్టర్ ఏ. భాగ్యరాజ్ తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొన్నారు.
ప్రజా సమస్యలే ఎజెండాగా.. ప్రజల మధ్యే ఉంటూ సేవ చేయడమే తన లక్ష్యమని డాక్టర్ ఏ. భాగ్యరాజ్ స్పష్టం చేశారు.



