📄 ePaper
Thursday, November 5, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతితిరుపతి జిల్లాలో 1,505 కేంద్రాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు!

తిరుపతి జిల్లాలో 1,505 కేంద్రాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు!

📰 Generate e-Paper Clip

-494 సాధారణ, 259 సమస్యాత్మక, 752 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తింపు

-11,70,397 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు

తిరుపతి, సత్యవెలుగు న్యూస్: జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు తిరుపతి జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,505 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో 494 సాధారణ కేంద్రాలు, 259 సమస్యాత్మక కేంద్రాలు, 752 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.

జిల్లాలో మొత్తం 11,70,397 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రెస్పాన్స్ బృందాలను అందుబాటులో ఉంచారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారం, ఫిర్యాదుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

కంట్రోల్ రూమ్ నంబర్: 0877-2235600

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!