📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిరేపు ఉదయం 8 గంటల నుంచి MPTC, ZPTC ఓట్ల లెక్కింపు!

రేపు ఉదయం 8 గంటల నుంచి MPTC, ZPTC ఓట్ల లెక్కింపు!

📰 Generate e-Paper Clip

అమరావతి, సత్య వెలుగు న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌లో 70.02 శాతం ఓటింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 82.51 శాతం పోలింగ్ నమోదైంది.

రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం

ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నవంబర్ 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

రాష్ట్రవ్యాప్తంగా 582 జెడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, బరిలో నిలిచిన 18,843 మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది.

కౌంటింగ్ ఫలితాలపై అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!