📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపెళ్లకూరు మండలంలో కామిరెడ్డి కుటుంబ సభ్యుల విస్తృత ప్రచారం!

పెళ్లకూరు మండలంలో కామిరెడ్డి కుటుంబ సభ్యుల విస్తృత ప్రచారం!

📰 Generate e-Paper Clip

-ఇంటింటి ప్రచారంలో ప్రభావతమ్మ, రజిని..

-గ్రామాల్లో సందడి చేసిన ఎన్నికల ప్రచారం

పెళ్లకూరు, సత్య వెలుగు న్యూస్:పెళ్లకూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డికి మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు ప్రభావతమ్మ, రజిని తదితరులు శనివారం మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఉదయం తాళ్లాయపాడు గ్రామం నుంచి ప్రారంభమైన ప్రచారం పెన్నేపల్లి, కానూరు, శిరసనంబేడు, రాజుపాలెం, చావలి, కప్పగుంట, కండ్రిగ, దర్శమాల, పాలచూరు, జంగాలపల్లి, అనకవోలు తదితర గ్రామాల్లో కొనసాగింది.

మంగళ వాయిద్యాల నడుమ, మహిళల హారతుల స్వాగతాల మధ్య ప్రచార కార్యక్రమం సందడిగా సాగింది. ఆయా గ్రామాల్లో దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ స్థానికులతో మమేకమయ్యారు.

ప్రచారానికి వచ్చిన కామిరెడ్డి కుటుంబ సభ్యులకు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ పోలవరం రెడ్డి శేఖర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షుడు ఒప్పు వెంకటరత్నం, మాజీ ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రమణ్యం తదితర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!