📄 ePaper
Tuesday, April 14, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినెప్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో “రన్ ఫర్ జీసస్” కార్యక్రమం విజయవంతం

నెప్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో “రన్ ఫర్ జీసస్” కార్యక్రమం విజయవంతం

📰 Generate e-Paper Clip

నాయుడుపేట: నెప్ ఫెలోషిప్ సేవకుల ఆధ్వర్యంలో నిర్వహించిన “రన్ ఫర్ జీసస్” శాంతి ర్యాలీ ఘనంగా, విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నెప్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ Rt. Rev. మైకేల్ బెన్హర్ గారు నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏసుప్రభువు ప్రపంచ మానవాళికి రక్షణను అందించడానికి మరియు శాంతిని స్థాపించడానికి ఈ లోకానికి వచ్చారని సందేశం అందించారు. సమాజంలో ప్రేమ, ఐక్యత, శాంతి విలువలను ప్రతీ ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ Rev. Dr. శరత్ బాబు గారు, సెక్రటరీ ప్రేమ కుమార్ గారు, జాయింట్ సెక్రటరీ సురేష్ పాల్ గారు, ట్రెజరర్ మురళీధర్ గారు పాల్గొన్నారు. అలాగే ఐజాక్ గారు, శామ్యూల్ గారు, హానరబుల్ ప్రెసిడెంట్ వినయ్ కుమార్ గారు, సలహాదారులు యేసు పాదం గారు, ప్రభుదాసు గారు, సూరిబాబు గారు, జాషువా గారు, ఎలీషా గారు కూడా హాజరయ్యారు.
ఈ శాంతి ర్యాలీలో వందలాది మంది విశ్వాసులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొని శాంతి, సౌహార్దతకు మద్దతు తెలిపారు. కార్యక్రమం మొత్తం శాంతియుత వాతావరణంలో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమం సమాజంలో శాంతి సందేశాన్ని విస్తృతంగా చాటిన ఒక స్ఫూర్తిదాయక కార్యక్రమంగా నిలిచింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!