చౌడేపల్లి, సెప్టెంబర్ 17: అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శెట్టిపేట పంచాయతీ శెట్టిపేట గ్రామంలో మాదిరాజు లక్ష్మణ్ రాజు నిర్మించిన మోక్ష గణపతి ఆలయంలో లక్ష్మణ్ రాజు, సుదర్శన్ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సాయంత్రం శెట్టిపేట పంచాయతీలోని ఏడు గ్రామాల్లో గణపతి ఉత్సవ విగ్రహాన్ని వైభవంగా ఊరేగించనున్నారు. గ్రామాలను విద్యుత్ దీపాలతో అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


