📄 ePaper
Tuesday, September 15, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివెలగని సెంటర్ లైట్లు.. ప్రయాణికులకు చీకటి కష్టాలు

వెలగని సెంటర్ లైట్లు.. ప్రయాణికులకు చీకటి కష్టాలు

📰 Generate e-Paper Clip

నాయుడుపేట, సెప్టెంబర్ 14: నాయుడుపేట బస్టాండ్‌ నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రధాన మార్గంలోని సెంటర్‌ లైట్లు కొద్దిరోజులుగా వెలగకపోవడంతో ప్రయాణికులు, స్థానిక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో మార్గం చీకటిమయంగా మారడంతో మహిళలు, వృద్ధులు, ఒంటరిగా ప్రయాణించే వారికి భద్రతపై ఆందోళన నెలకొంది.

రహదారికి ఇరువైపులా ఉన్న మెకానిక్‌ దుకాణాల వద్ద కూడా చీకటి కారణంగా దొంగతనాల భయం ఉందని మెకానిక్‌ యూనియన్‌ సభ్యులు తెలిపారు. సెంటర్‌ లైట్లను వెంటనే మరమ్మతు చేసి వెలిగించాలని మెకానిక్‌ యూనియన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ తిరుమల్లి శ్రీనివాసులు, సభ్యులు రమేష్‌, ఎం.రవి, కృష్ణయ్య తదితరులు అధికారులను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!