📄 ePaper
Thursday, September 17, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుస్థానిక ఎన్నికల్లో విజయమే ధ్యేయం: కాకాణి గోవర్ధన్‌రెడ్డి

స్థానిక ఎన్నికల్లో విజయమే ధ్యేయం: కాకాణి గోవర్ధన్‌రెడ్డి

📰 Generate e-Paper Clip

మనుబోలు, సెప్టెంబర్ 16: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మనుబోలులోని పద్మావతి కళ్యాణ మండపంలో నిర్వహించిన సర్వేపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని, ప్రకృతి సంపద, ప్రభుత్వ భూముల విషయంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని కాకాణి ఆరోపించారు. సాగునీటి సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. గొలగమూడి వద్ద అక్రమంగా సంత నిర్వహిస్తున్నారని, గోవుల అక్రమ తరలింపును అడ్డుకోవాలని అన్నారు.

సీఎస్‌ఆర్‌ నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు ఐడీ కార్డులు అందజేస్తున్నామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో పార్టీకి మెజారిటీ సాధించేందుకు శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!