📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపెళ్లకూరులో ఘనంగా దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమాలు, ప్రతి బూత్‌లో నివాళులర్పించాలి.. పార్టీ శ్రేణులకు మండల...

పెళ్లకూరులో ఘనంగా దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమాలు, ప్రతి బూత్‌లో నివాళులర్పించాలి.. పార్టీ శ్రేణులకు మండల అధ్యక్షుడు కాలిచేటి నరసింహులు పిలుపు

📰 Generate e-Paper Clip

పెళ్లకూరు, సెప్టెంబర్ 24 (సత్య వెలుగు NEWS):
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 25న ఉదయం 8 గంటలకు తాల్వాయిపాడు బీజేపీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీజేపీ మండల అధ్యక్షుడు కాలిచేటి నరసింహులు తెలిపారు.

నియోజకవర్గంలోని మండల నాయకులు, కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్‌చార్జీలు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన కోరారు. ప్రతి మండలం, ప్రతి బూత్‌లో దీనదయాళ్ ఉపాధ్యాయకు నివాళులర్పించేలా బూత్ కమిటీలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమాల అనంతరం ఫొటోలు, వివరాలను జిల్లా పార్టీ కార్యాలయానికి పంపడంతో పాటు సరళ్ (Saral) యాప్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు. సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సెప్టెంబర్ 25న నిర్వహించబడుతుందని బీజేపీ కేంద్ర గ్రంథాలయ రికార్డుల్లోనూ పేర్కొనబడింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!