📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeరాజకీయంవై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీస్థితప్రజ్ఞుడు’ పుస్తకావిష్కరణ

స్థితప్రజ్ఞుడు’ పుస్తకావిష్కరణ

📰 Generate e-Paper Clip

– వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా కార్యక్రమం

– వైయస్ జగన్ రాజకీయ ప్రస్థానంపై సమగ్ర రచన

– పుస్తకాన్ని ఆవిష్కరించిన సజ్జల రామకృష్ణారెడ్డి
తాడేపల్లి, అక్టోబర్‌ 5 ,సత్య వెలుగు న్యూస్: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సీనియర్ జర్నలిస్ట్‌, సాంకేతిక నిపుణుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ రచించిన ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకాన్ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ రాజకీయ జీవనయానం, నాయకత్వ లక్షణాలు, రాజకీయ ప్రస్థానంలోని వివిధ ఘట్టాలను సమగ్రంగా ప్రతిబింబించేలా ఈ పుస్తకాన్ని రచించినట్లు కార్యక్రమంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైయస్ జగన్ రాజకీయ జీవితాన్ని లోతుగా అధ్యయనం చేసి పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. ఒక రాజకీయ నాయకుడి ప్రయాణం, ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, తీసుకున్న నిర్ణయాలు, ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధాన్ని భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచే ప్రయత్నంగా ఈ రచన నిలుస్తుందని తెలిపారు.
వైయస్ జగన్ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా స్థిరచిత్తంతో ముందుకు సాగిన తీరును ‘స్థితప్రజ్ఞుడు’ అనే శీర్షిక ప్రతిబింబిస్తోందని సజ్జల పేర్కొన్నారు. రాజకీయ జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఒకేచోట సమగ్రంగా చేర్చి పాఠకులకు అందించడం రచయిత చేసిన మంచి ప్రయత్నమని కొనియాడారు. రాజకీయ చరిత్రను కేవలం సంఘటనల సమాహారంగా కాకుండా, వాటి వెనుక ఉన్న పరిస్థితులు, నాయకత్వ దృక్పథం, ప్రజలతో ఉన్న అనుబంధాన్ని కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా ఈ పుస్తకం ఒక విలువైన రచనగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికి, పరిశోధకులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
పుస్తక రచయిత డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మను ఈ సందర్భంగా సజ్జల ప్రత్యేకంగా అభినందించారు. వైయస్ జగన్ రాజకీయ ప్రస్థానాన్ని నిష్పాక్షికంగా విశ్లేషించి పాఠకులకు అందించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ పుస్తకం విస్తృత ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రచయిత డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ కల్పలత, ఎంవీఎస్ నాగిరెడ్డి, కొవ్వూరి త్రినాథరెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, షరీఫ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ అనంతరం రచయితను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!