పెళ్లకూరు, సత్య వెలుగు న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెళ్లకూరు మండల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను పెళ్లకూరు ఎస్ఐ ఆదిలక్ష్మి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, మౌలిక వసతులు, పరిసర పరిస్థితులను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసు శాఖ తరఫున భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.




