📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిశ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల వేళ టీటీడీ కీలక నిర్ణయం

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల వేళ టీటీడీ కీలక నిర్ణయం

📰 Generate e-Paper Clip

-ఈ నెల 11 నుంచి 20 వరకు VIP సహా పలు ప్రత్యేక దర్శనాలు రద్దు

తిరుపతి: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు VIP బ్రేక్‌ దర్శనాలతో పాటు పలు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది.

ప్రొటోకాల్‌ పరిధిలోని ప్రముఖులకు మినహా VIP బ్రేక్‌ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక దర్శనాలను 10 రోజుల పాటు నిలిపివేయనున్నారు. అలాగే NRI, డిఫెన్స్‌ కోటా దర్శనాలను కూడా రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి దర్శన ఏర్పాట్లను టీటీడీ ప్రత్యేకంగా చేపడుతోంది.

ఇదిలా ఉండగా, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రేపు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!