📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అన్నమయ్యచౌడేపల్లి మండలం లద్దిగంలో స్వెచ్ఛా సంకల్పం - స్వచ్ఛ భారత్ ప్రాజెక్ట్ షెడ్‌ పరిశీలన

చౌడేపల్లి మండలం లద్దిగంలో స్వెచ్ఛా సంకల్పం – స్వచ్ఛ భారత్ ప్రాజెక్ట్ షెడ్‌ పరిశీలన

📰 Generate e-Paper Clip

 చౌడేపల్లి, అక్టోబర్ 7, సత్య వెలుగు న్యూస్:
మండలంలోని లద్దిగం గ్రామ పంచాయతీలో బుధవారం  డిప్యూటీ ఎంపీడీవో ఎస్.ఎ.గఫూర్  పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ‘సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్’  షెడ్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీలో భాగంగా షెడ్‌లోని చెత్త వర్గీకరణ, నిర్వహణ తీరును పరిశీలించిన ఆయన, తడి చెత్త నుండి నాణ్యమైన వర్మీ కంపోస్ట్  తయారీపై పలు ముఖ్యమైన సూచనలు చేశారు. గ్రామాల్లో సేకరించే చెత్తను సక్రమంగా వర్గీకరించి, ఎరువుగా మార్చడం ద్వారా పంచాయతీకి అదనపు ఆదాయం లభించడమే కాకుండా, గ్రామం పరిశుభ్రంగా ఉంటుందని తెలిపారు.
ఎరువు తయారీ ప్రక్రియలో పాటించాల్సిన మెళకువలు, కాలపరిమితి, నాణ్యతా ప్రమాణాల గురించి పంచాయతీ కార్యదర్శికి  గ్రీన్ అంబాసిడర్లకు ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. విధుల పట్ల అంకితభావంతో పనిచేసి లద్దిగం పంచాయతీని స్వచ్ఛ పంచాయతీగా తీర్చిదిద్దాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రీన్ అంబాసిడర్లు మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!