📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివెంకటగిరిలో నవజీవన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

వెంకటగిరిలో నవజీవన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

-టాటా క్యాన్సర్ హాస్పిటల్, తిరుపతి భాగస్వామ్యంతో వైద్య సేవలు

-200 మందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, సాధారణ వైద్య సేవలు

వెంకటగిరి, అక్టోబర్ 8,సత్య వెలుగు న్యూస్: నవజీవన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో టాటా క్యాన్సర్ హాస్పిటల్, తిరుపతి వారి భాగస్వామ్యంతో గురువారం వెంకటగిరిలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు నవజీవన్ ఆర్గనైజేషన్ కార్యాలయ ప్రాంగణంలో ఈ వైద్య శిబిరం ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. సి.హెచ్. హరిత, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్ డా. ఎన్. తులసీదాసు, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మరియు జిల్లా PC & PNDT Act సభ్యులు కె.వి. రమణ, టాటా క్యాన్సర్ హాస్పిటల్ ప్రోగ్రామ్ మేనేజర్ పి.వి. హేమంత్ కుమార్ పాల్గొన్నారు.

అలాగే నవజీవన్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కె. సహదేవయ్య, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి కె. విక్టోరియాతో పాటు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

క్యాన్సర్‌పై ఉచిత పరీక్షలు

శిబిరంలో ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్కు సంబంధించిన ఉచిత స్క్రీనింగ్ పరీక్షలతో పాటు సాధారణ వైద్య సేవలు అందించారు. డాక్టర్ రాజేష్, డాక్టర్ సత్యప్రియతో పాటు టాటా క్యాన్సర్ హాస్పిటల్ వైద్య బృందం పర్యవేక్షణలో వైద్య సేవలు నిర్వహించారు.

ఈ మెగా వైద్య శిబిరంలో సుమారు 200 మంది ప్రజలు పాల్గొని ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. నవజీవన్ ఆర్గనైజేషన్ గత 30 సంవత్సరాలుగా ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ప్రజలకు ఆరోగ్య సేవలను చేరువ చేయడంలో సంస్థ చేస్తున్న కృషిని ప్రశంసించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!