📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఘనంగా టీడీపీ యువనేత వేలూరు కళ్యాణ్ రెడ్డి జన్మదిన వేడుకలు!

ఘనంగా టీడీపీ యువనేత వేలూరు కళ్యాణ్ రెడ్డి జన్మదిన వేడుకలు!

📰 Generate e-Paper Clip

-జన్మదిన వేడుకల సందర్భంగా అనాథ చిన్నారులకు అన్నదానం..

-ఆశ్రమానికి రూ.5 వేల విరాళం!

సత్య వెలుగు న్యూస్ – పెళ్లకూరు: తెలుగుదేశం పార్టీ యువనేత వేలూరు కళ్యాణ్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం పెళ్లకూరు మండలం శిరసనంబేడు గ్రామంలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వేలూరు కళ్యాణ్ రెడ్డి భారీ కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం నాయుడుపేట పట్టణంలోని చేయూత అనాథ చిన్నపిల్లల ఆశ్రమంలో వేలూరు కళ్యాణ్ రెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులకు భోజనం అందించి తన సేవాభావాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా ఆశ్రమ నిర్వహణకు తన వంతు సహాయంగా రూ.5,000 విరాళాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వేలూరు మురళీకృష్ణారెడ్డి, జనసేన పార్టీ నాయకులు కేశవరెడ్డి, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేలూరు కళ్యాణ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!