పెళ్లకూరు, అక్టోబర్ 9, సత్య వెలుగు న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తూ, బైండ్ఓవర్ చర్యలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ పెళ్లకూరు మండల నాయకులు ఆరోపించారు. ఎలాంటి నేరచరిత్ర లేని తమపై ముందస్తు చర్యల పేరుతో బైండ్ఓవర్ చేయడం అన్యాయమని వారు పేర్కొన్నారు.
సగి జితేంద్ర నాయుడు, బండి బాలు, గంజి మాతయ్య తదితరులతో కలిపి మొత్తం 24 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు తెలిపారు.
ఎన్ని కేసులు, బెదిరింపులు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదని నాయకులు స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా, కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని వెల్లడించారు.




